అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు అని నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నగర పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్ నాయుడుపేట 5వ లైన్‌లో పండుగ వాతావరణంలో స్మార్ట్ రేషన్ కార్డులు, పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళ మాధవి స్వయంగా పాల్గొని అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు, పెన్షన్ దారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ ఆర్థిక సవాళ్లు ఎంత ఉన్నా కూటమి ప్రభుత్వం సాటిలేని సంక్షేమాన్ని అందిస్తోంది తెలిపారు.