జనగామ జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతుల కష్టాలు పడుతున్నారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం ఉదయం జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు నిరసనకు దిగారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని మండిపడ్డారు.రైతులకు యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతుల కోరారు.