మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా శాంతియుతంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. మండపాల వద్ద డిజె సౌండ్ లు పెట్టవద్దని ఆదేశించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండల పరిధిలోని గ్రామాల వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.