ఎలాంటి అనుమతులు లేకుండా ASF మండలంలోని చిర్రకుంట గ్రామ శివారులోని వాగులో అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ASF సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం సాయంత్రం చిర్రకుంట ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీస్ సిబ్బంది పట్టుకున్నట్లు తెలిపారు. రెండు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాక్టర్ యజమాని డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.