Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాల ముందు నిరసన తెలిపిన పిడిఎస్యు నాయకులు

Armur, Nizamabad | Sep 23, 2025
రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను బేకాతరు చేస్తూ ఆర్మూర్ పట్టణంలో ఆల్ ఫోర్స్ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నారని సమాచారం తెలిసిన పిడిఎస్ యు నాయకులు మంగళవారం మధ్యాహ్నం 12:50 పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పిడిఎస్సి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించినప్పటికీ ఆల్ ఫోర్స్ పాఠశాల యజమాని పాఠశాలను తెరిచి ఉంచి విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నారని ఈ విషయం మండల విద్యాశాఖ అధికారికి తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడo పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us