విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఎస్ఎంఎస్ విభాగంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ ఉద్యోగి మృతి చెందాడు వడ్లపూడి ప్రాంతానికి చెందిన కర్రీ పైడి కొండయ్య ఎస్ఎంఎస్ విభాగంలో టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు బుధవారం సాయంత్రం విభాగంలోని క్రేన్ పై పనులు చేస్తుండగా జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. గురువారం ఉదయం 8 గంటలకు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి 8:45 నిమిషాలకు కర్రీ పైడికొండ వాష్ రూమ్ కి వెళ్ళేందుకు తిరుపతి నాయక్ ఆపరేషన్ అప్పగించాడు. తర్వాత కొంత సమయానికి మరణించాడు.