రాయికల్ పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో నిరుద్యోగ యువతకు జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో..ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో అందిస్తున్న ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, టైలరింగ్, హోం ఎయిడ్ హెల్త్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతీ, యువకులకు మంగళవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగ యువత కోసం మహారాష్ట్ర మాజీ గవర్నర్ చేన్నమనేని విద్యాసాగర్ రావు, జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశయాలతో స్థాపించిన ఈ భవనంలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సేవలు అమోఘం అని కొనియాడారు.