నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం ఎంత ప్రసిద్ధి చెందిందో.. ఇక్కడ పండే అరటిపంట అంత ప్రసిద్ధి చెందిందన్న విషయం అందరికీ తెలిసిందే. మహానంది సమీపంలోని ఎంసీ ఫారం వద్ద ఉన్న ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మహానంది మండలంలో పండించే సుగంధం రకం అరటిపంట ప్రత్యేకతపై పరిశోధనలు చేస్తున్నారు.అందులో భాగంగా మంగళవారంమహానంది ఆలయానికి చేరుకుని వేద పండితులతో చర్చించారు. మహానంది కోనేరు నుంచి వచ్చే నీరు అరటి పంట పొలాలకు వెళ్తుంటుంది.