ఎస్సై తురక వెంకటరమణ అలియాజ్ గబ్బర్ సింగ్ కి సిఐగా పదోన్నతి పొందిన సందర్భంగా నాయుడుపేటలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఆయన అభిమానులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా గబ్బర్ సింగ్ సీఐ కి ఆయన అభిమానులు పూలమాలలు శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అర్పించారు.ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సైగా పలు చోట్ల బాధ్యతలు చేపట్టి విధి నిర్వహణలో ఎవ్వరికి తలవంచకుండా ఎన్నో అవరోధాలను ఆటంకాలను ఎదుర్కొని గబ్బర్ సింగ్ ఎస్సైగా పేరుపొందిన ప్రజా అధికారి తురకా వెంకట రమణ