శుక్రవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత కన్వెన్షన్ హాల్ లో నీతి ఆయోగ్-ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో భాగంగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో “ఆకాంక్ష హాట్ – ఎగ్జిబిషన్ & సేల్” కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ మహిళల స్వహస్తాలతో రూపొందించిన హ్యాండ్లూమ్ వస్త్రాలు,గద్వాల్ పట్టు చీరలు,సేంద్రీయ ఉత్పత్తులు, పర్యావరణహిత వస్తువులు, చేతిపనుల క్రాఫ్ట్స్, ఆహార పదార్థాలు అన్నీ విశిష్ట నాణ్యతతో తయారై ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని అభినందించారు...