అంబాజీపేట మండలానికి చెందిన ప్రముఖ వ్యాపారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాజీ కమిటీ చైర్మన్ మేడిది చిన్న (55) మంగళవారం పంట కాలువలో దూకి మృతి చెందారు. కొత్తపేట మండలం రాగుర్తి వారిపాలెం వద్ద తన బైకు రోడ్డు చెంతన పెట్టి పంట కాలువలోకి దూకినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు.