Parvathipuram, Parvathipuram Manyam | Aug 28, 2025
విద్యుత్ బారాలు మోపవద్దంటూ 2వేలు సంవత్సరం ఆగస్టు 28న జరిగిన బషీరాబాద్ తరహా పోరాటం మళ్ళీ నేడు జరిగేలా చేయొద్దంటూ పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు అన్నారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో సంఘం నాయకులతో కలిసి మెయిన్ రోడ్ లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల గొంతు కోయాలని చూస్తున్నాయన్నారు. ఈ విధానాలను ఆపకపోతే మరో బషీరాబాద్ విద్యుత్ పోరాటం జరుపుతామని హెచ్చరించారు. అధికారం రాకముందు చార్జీలు పెంచబోమని చెప్పి, అధికారం చేపట్టాక అధిక భారాలు వేయడం తగదన్నారు.