విద్యుత్ తీగలు తగిలి గర్భందాల్చిన ఓ గెద మృత్యువాత పడిన ఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. స్థానిక విజయ డెయిరీ మిల్క్ చిల్లింగ్ సెంటర్ లో శనివారం విద్యుత్ తీగ తెగిపడటంతో మేతకు వచ్చిన ముర్రా జాతి గేదెకు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి మృత్యువాత పడింది. కాగా ఘటన స్థలాన్ని పశు వైద్యాధికారి దూద్ రామ్ రాథోడ్ పరిశీలించారు. ఐతే గెద మృతితో రూ.80 వేల నష్టం జరిగిందని గేద యజమానురాలు కళా ఆశ్రమానికి చెందిన రాజశ్రీ శర్మ పేర్కొన్నారు.