పెద్దవడుగూరు మండలం కండ్ల గూడూరు గ్రామానికి చెందిన విద్యార్థి మహేంద్ర రెడ్డి అదృశ్యమయ్యాడు. శనివారం ఉదయం కండ్ల గూడూరు నుంచి పెద్దవడుగూరు లోని సరస్వతి పాఠశాలకు వెళ్లాడు. అయితే తిరిగి ఇంటికి వెళ్ళలేదు. చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో తండ్రి హనుమంత రెడ్డి తన కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మహేంద్ర రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.