శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక ప్రతిమలను కొలువు తీర్చి మండపాలను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కదిరి డి.ఎస్.పి శివ నారాయణస్వామి తెలియజేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి పొందాలని, విద్యుత్ దీపాల ఏర్పాట్లు జాగ్రత్తలు పాటించాలని, మండపం వద్ద ఇద్దరు లేదా ముగ్గురు రాత్రి సమయాల్లో నిద్రించాలని సూచించారు.