Parvathipuram, Parvathipuram Manyam | Aug 31, 2025
ప్రజల సమస్యలను ప్రభుత్వం తప్పక పరిష్కరిస్తుందని రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అధికంగా రైతులు సాగునీటి సమస్యలతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతుందని, ఎరువులు, విత్తనాల కొరతతో అవస్థలు పడుతున్నామంటూ మంత్రికి వినతులను అందజేశారు.