సంగారెడ్డి జిల్లా వటపల్లీ మండలం నాగులపల్లి గ్రామ శివారులో వెలసిన సమ్మక్క సారక్క జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పువ్వులతో అందంగా ముస్తాబు చేసిన అమ్మవార్ల గద్దెలను భక్తులు దర్శించుకున్నారు. మేడారం జాతరలో సమ్మక్క సారక్క గద్దెలను పోలినట్టు నాగులపల్లి లో అమ్మవార్ల గద్దెలు కూడా ఉండడం విశేషంగా చెప్పుకుంటారు.