ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ప్రతి ప్యాసింజర్తో డ్రైవర్ స్నేహ పూర్వకంగా మెలగాలని జిల్లా ప్రజా రవాణా అధికారి అమరశింహుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం, టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్లు, హైయర్ బస్సు యజమానులతో బుధవారం ఆర్టీసీ ఆర్ఎం ఆఫీసులో సమావేశం జరిగింది. ప్రయాణికులు చెయి ఎత్తేచోట బస్సు ఆపాలని, బస్సులను కండిషన్గా ఉంచాలని కోరారు. డిపో మేనేజర్లు శర్మ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.