తల్లాడ పట్టణ కేంద్రంలో స్థానిక రింగ్ రోడ్డు సెంటర్ నందు ఇటీవల కురిసిన వర్షాలకు భారీ గుంతలు ఏర్పడడం వల్ల వాహనదారులు మరియు రోడ్డు మీద తిరిగే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.ఆ గుంతలను తల్లాడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ వెంకట్ కృష్ణ ఆధ్వర్యంలో గ్రావెల్స్ తో గుంతలను పూడ్చి వేయడం జరిగింది. నిరంతరం భారీ వాహనాలు తల్లాడ రింగ్ రోడ్డు ప్రాంతం నుంచి వెళుతూ ఉంటాయి కాబట్టి వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండాఎలాంటి ప్రమాదాలు జరగకుండా గుంతలు పూడ్చి వేయడం జరిగింది. ఇలాంటి మంచి పని చేసిన పోలీస్ శాఖ వారికి తల్లాడ మండల ప్రజానిక తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.