నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో పడమటి ఆంజనేయ స్వామి జాతర బ్రహ్మోత్సవాల నాటికి కోనేరు ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక డైరీ అభివృద్ధి క్రీడలు యువజన సేవలు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం కోనేరు ను నాలుగు గంటల సమయంలో సందర్శించి మాట్లాడుతూ గతంలో కోనేరు ను ఎవరు పట్టించుకోలేదని అపరిశుభ్రంగా మారిందని అన్నారు. ఇప్పుడు తిరుమల యాదగిరిగుట్ట స్థాయిలో సుందరీకరణ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు.