పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అన్ని కోర్టులలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సివిల్ జడ్జి విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా మాట్లాడుతూ సివిల్ తగాదాలు బ్యాంకు కేసులు రాజీ పడదగిన క్రిమినల్ కేసులు మనోవర్తి కేసులు చెక్కు బౌన్స్ కేసులు రెవెన్యూ కేసులు ఫ్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ పెండింగ్ కేసులను రాజీ చేసుకోవాలని ఆయన సూచించారు.