తిరుపతి జిల్లా గూడూరులో విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న కొమ్మలను శనివారం ఉదయం నుంచి కత్తిరిస్తున్నారు. దీంతో ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ నెల 21న గూడూరులో జెండా ఉత్సవం ఉంది. దక్షిణ భారతదేశంలో మైసూర్ తర్వాత గూడూరులో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కొమ్మల కత్తిరింపుతో జెండా నిర్వాహకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.