వైసిపి నాయకులు మంగళవారం పార్వతీపురంలో అన్నదాతపోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి రాజన్న దొర, పరీక్షిత్ రాజు, పిఎస్ఎన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమాన్ని అణచివేసేందుకు పలు రకాలుగా ప్రయత్నించారన్నారు. రైతులకు ఎరువులు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఏవో కు వినతిపత్రం అందజేశారు.