మొన్నటి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కోనేరు గెడ్డకు గండిపడి ముంపుకు గురైన పొలాలను, మెంటాడ మండలం లక్ష్మీపురం చంపావతి నదిపై రాకపోకల కొరకు నిర్మించిన కల్వర్ట్ కొట్టుకుపోవడాన్ని స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోనేరు గెడ్డ గండి విధానాన్ని పరిశీలించిన మంత్రి తక్షణమే గండి పూడిక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపుకు గురై పంట నష్టం వాటిల్లిన రైతులకు న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం లక్ష్మీపురం చంపావతి నదిపై నిర్మించిన కల్వర్టు పరిశీలించిన మంత్రి విద్యార్థులకు అత్యవసర