అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయతీ కొండ శిఖర గ్రామమైన చిన్న కోనల గ్రామంలో 30 కుటుంబాలు కొండ దొర తెగ ఆదివాసి గిరిజనులు 63 రోజులుగా విద్యుత్ లేక చీకటిలో మగ్గుతున్నామనీ, మంగళవారం రాత్రి 7గంటల సమయంలో పాడేరు మీడియాకు వాట్సాప్ ద్వారా అక్కడి సమస్యను వెల్లడించారు. స్థానిక గిరిజనులు అంతా కలిసి కాగడాల ప్రదర్శన చేస్తూ తమ నిరసన వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా కరెంటు లేక చీకటి ప్రపంచంలో మగ్గిన తమకు 8 నెలల క్రితం కొత్తగా వచ్చిన విద్యుత్ సౌకర్యం కాస్త ట్రాన్స్ఫార్మ్ కాలిపోయిన కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, మళ్లీ తమ పరిస్థితి మొదటికే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.