ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కడ PD వికాస్ మర్మత్ మంగళవారం పిలుపునిచ్చారు. నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా కుప్పంలో విప్లవాత్మకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. సోలార్ విద్యుత్, సోలార్ పంప్ సెట్స్, CNG, ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా చెత్త సేకరణ, చెత్త నుంచి సంపద సృష్టించడం తదితర కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.