మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ.38 లక్షల బీమా ఆళ్లగడ్డ యూనిట్లో హోంగార్డుగా పనిచేస్తూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాలిక్ బాషా కుటుంబ సభ్యులకు రూ.38 లక్షల బీమా పరిహారం అందించినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ మేరకు మంగళవారం చెక్కును మాలిక్ బాషా సతీమణికి అందజేశారు. కార్యక్రమంలో హోం గార్డ్ కమాండెంట్ మహేశ్ కుమార్, డీఎస్పీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.