రాతన: గుంతల రోడ్డులో ఇరుక్కుపోయిన కర్ణాటక బస్సు తుగ్గలి మండలంలో రాతన గ్రామంలో కర్ణాటక బస్సు శనివారం గుంతల రోడ్డులో ఇరుక్కుపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా, అధికారులు పట్టించుకోటం లేదు. రోడ్లు దెబ్బతిన్నాయని పలుసార్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారులు నిమ్మక నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. చెన్నై, బొంబాయి నుంచి వందల వాహనాలు ఈ రహదారి గుంతల కారణంగా ప్రమాదాలకు గురవుతున్నాయి.