ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోనీ వడ్డేపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు జరిగిన వడ్డేపల్లి మండల స్థాయి SGF క్రీడా టోర్నమెంట్ గర్ల్స్ & బాయ్స్ ప్రారంభ పోటీలకు ముఖ్య అతిథిగా అలంపూర్ శాసనసభ్యులు విజేయుడు హాజరై కబడ్డీ పోటీలలో రెండు టీమ్ లకు టాస్ ఎగరటం జరిగింది .ఉపాధ్యాయులు వారిని సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కబడ్డీ క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.