ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీలో నివాసం ఉండే వెంకట లక్ష్మి ని ఆమె భర్త రాజగోపాల్ తరచూ మద్యం తాగి వచ్చి వేధిస్తూ దాడికి పాల్పడుతున్నాడు. కొత్త ప్రవర్తనతో విసిగిపోయిన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. మద్యం తాగి వచ్చి నిరంతరం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై సైదుబాబు తెలిపారు.