ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చెయడం అన్యాయమని, నేరం రుజువు కాకుండా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం కక్ష సాధింపు చర్యని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాజమహేంద్రవరం సెంటర్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ స్పీకర్ శుక్రవారం ములకత్ అయ్యారు. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టిన కడిగిన ముత్యంలా ఆయన తిరిగి వస్తారన్నారు.