పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని శాంతి భవనానికి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ NV రమణ బుధవారం రాత్రి చేరుకున్నారు. ఆయనకు ఆర్డీవో సువర్ణ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం జస్టిస్ NV రమణ కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రశాంతి నిలయానికి వచ్చారు. వీరు గురువారం ఉదయం సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకోనున్నారు.