వనస్థలిపురం డివిజన్ పరిధిలో లయన్స్ క్లబ్ వారు నిర్వహించిన 2500 అడుగుల జాతీయ జెండా ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జెండా దేశసార్వభౌమాధికారానికి గౌరవానికి సమిష్టి ఐక్యతకు ప్రతికని అన్నారు. భారీ జెండాలు ఈ విలువలను మరింత ప్రభావంతంగా ప్రజలకు చేరవేస్తాయని ఇలాంటి జాతీయ జెండా ర్యాలీలు దేశభక్తిని పెంపొందించడమే కాక ప్రజల్లో ఐక్యత భవాని పెంచుతాయని అన్నారు.