శ్రీకాకుళం జిల్లా మందస రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి కుర్రాయి గేటు మధ్యలో సోమవారం రైలు నుండి జారిపడి సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గమనించి grp పోలీసులకు సమాచారం అందించారు.. విషయం తెలుసుకున్న జి ఆర్ పి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుని ఆచూకీ తెలిసినవారు పలాస రైల్వే స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ హరినాథ్కు సంప్రదించాలని సూచించారు.. ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడి మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు..