చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో గ్రామదేవతలకు బోనాలు చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో శ్రావణమాసం చివరి గురువారం పురస్కరించుకొని బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని గ్రామదేవతలకు ఎల్లమ్మ, పోచమ్మ లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో రేణుక ఎల్లమ్మ లకు మట్టి కుండలో పచ్చ అన్నం వండుకుని బోనాల ఊరేగింపు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్, ఉప సర్పంచ్ స్వామి, గ్రామస్తులు సాయికుమార్, చంద్రం, లక్ష్మణ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.