అలంపూర్ మండల పరిధిలోని యాపలాదేవిపాడు గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చుట్టు ప్రహారి గోడను నిర్మించాలని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడంతో విష సర్పాలు పాఠశాలలోకి ప్రవేశించి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ప్రహారి గోడను నిర్మించాలని డిమాండ్ చేశారు.