ఏలూరు శివారు సోమరపాడు వద్ద పెదవేగి ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా, సీటు బెల్ట్ ధరించకుండా నడుపుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ద్విచక్రం కారు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ సీటు బెల్టు వాడాలని ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే తమ ప్రాణాలను రక్షించుకోవచ్చు అని ఇన్స్పెక్టర్ తెలిపారు. హెల్మెట్ వాడని వాహనదారులు ప్రమాదానికి గురవడం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.