స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి గాను కంప్యూటర్ సబ్జెక్టు బోధించుటకు అతిధి అధ్యాపకుల కై అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కలువకుంట రామకృష్ణ మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్-1 బోధించుటకు అతిధి అధ్యాపకల అవసరంకలదని పేర్కొన్నారు. ఇందుకుగాను సంబంధిత సబ్జెక్టులలో పీజీ లో 55% మార్కులు ఎస్సీ ఎస్టీలకు 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. పీహెచ్డీ/ నెట్/సెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత....