మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఆసిఫాబాద్ పట్టణంలోని జానకపూర్ లో శుక్రవారం ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని జానకాపూర్ మసీదు నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. ముస్లిం మైనార్టీ మత పెద్దలు మాట్లాడుతూ.. మహ్మద్ ప్రవక్త జయంతిని మిలాద్ ఉన్ నబీ పండుగగా పవిత్రంగా జరుపుకుంటారని తెలిపారు. అనంతరం మసీదులో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.