ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంక్షేమంలో భాగంగా చేపట్టిన మధ్యాహ్న భోజనంలో నిర్దేశించిన మెనూ సక్రమంగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం జెండాగూడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యత, హాజరు పట్టికలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన రుచికరమైన ఆహారాన్ని మధ్యాహ్న భోజనం మెనూ ద్వారా అందించడం జరుగుతుందన్నారు.