చంద్రబాబు నగర్ లోని మూడు ఎకరాల స్మశాన వాటికను కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని TNsf రూరల్ అధ్యక్షుడు ఆశిక్ అలీ ఖాన్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దొంగ పట్టాలను సృష్టించి ఆక్రమాలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునగర్, శ్రామిక నగర్ , నక్క గోపాల్ నగర్ , కుమ్మరిగుంట కాలనీ ప్రాంతాలకు స్మశాన వాటిక చంద్రబాబు నగర్ లో ఉందని, దాన్ని కబ్జా చేస్తే స్థానికులు అనేక ఇబ్బందులు పడతారని ఆయన అన్నారు. కలెక్టర్ దీనిపై స్పందించి దొంగ పట్టాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు