పెడన గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'అన్నదాత పోరు' కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసింది. పెడన నుంచి మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐలతో కార్య కర్తలు వాగ్వాదానికి దిగారు.