తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ డోన్లోని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరులు ఆర్డీవోకు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేకుండా కష్టాల్లో ఉన్న విలేకరులకు స్థిరాస్తి కల్పించాల్సిన అవసరం ఉందని యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. విలేకరులు శ్రీనివాసులు, నవీన్ కుమార్, నాగరత్నం, మోహన్, ప్రవీణ్, శివానంద్, విక్రమ్, యాగంటి, మహమ్మద్, విజయ్ పాల్గొన్నారు.