నంద్యాల జిల్లా బేతంచర్ల వినాయక ఘాట్లో ఉన్న చెత్తాచెదారాలను సోమవారం పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. అయ్యల చెరువులోని వినాయక ఘాటును గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ హరిప్రసాద్ తెలిపారు. ముందుగా ఘాటును పరిశీలించి ఘాట్లో ఉన్న వ్యర్ధాలను తొలగించే పనులు చేపట్టి, నిమజ్జనం నాటికి ఘాటును సుందరంగా తీర్చిదిద్ది నీటితో నింపుతామని వారు తెలిపారు.