శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం ఓ ఆటో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం, భారీ వాహనాలు రాకపోవడం వలన పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో కేవలం ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవేస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఆటో డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గురైన వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.