అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో అక్షర ఆంధ్ర కార్యక్రమం పై ఉల్లాస్ కన్వీనర్ శ్రీనివాసరావు గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అక్షర ఆంధ్ర కార్యక్రమం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీలో 4700 మంది నిరక్షరాశులను గుర్తించడం జరిగిందన్నారు. వీరందరికీ వాలంటీర్లు స్వచ్ఛందంగా విద్యను నేర్పించాలన్నారు. ముఖ్యంగా డిజిటల్ విద్యను నేర్పించాలన్నారు. పదవ తరగతి విద్యా అర్హత కలిగిన వారు స్వచ్ఛందంగా విద్యను నేర్పించాలన్నారు.