గుడిసెలో ఉండే వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని ఓ దివ్యాంగురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు సోమవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మీడియాతో తన గోడును వెల్లబుచ్చున్నారు. తాడ్వాయి (మం) నార్లాపూర్ గ్రామానికి చెందిన భూక్య సునీత అనే దివ్యాంగురాలు తనకు గడ్డి గుడిసె ఉందని, గతంలో అధికారులు వచ్చి ఫోటో తీసుకువెళ్ళారని కానీ తనకు ఇందిరమ్మ ఇళ్ళ అర్హుల జాబితాతో పేరు రాలేదని వాపోయారు. తనకు సమస్యను కలెక్టర్ గారి ద్రుష్టికి తీసుకెళ్ళేందుకు వచ్చానని అన్నారు.