గత వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌బాబు అన్నారు. కర్నూలులోని గిరిజన భవన్‌లో ఆదివారం గిరిజన సలహా మండలి సభ్యులుగా కర్నూలు జిల్లా వాసి వెంకటపతి నియమితులైన సందర్భంగా సన్మాన సభ జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేఈ శ్యామ్‌బాబు, బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామ్‌బాబు మాట్లాడుతూ, “మొట్టమొదటిసారి గిరిజన సలహా మండలి సభ్యత్వం కర్నూలు జిల్లాకు రావడం గర్వకారణం. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్‌గా నిలిచాయి” అని అన్నారు.సభ్యుడు వెంకటపతి మాట్లాడుతూ, “ఈ పదవి దక్కేలా కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, నార