భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని సొసైటీలో యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుండి యూరియా కోసం పడిగాపులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువసేపు క్యూ లైన్ లో రైతులు నిలబడలేక రైతుల చెప్పులను ఆధార్ కార్డును లైన్ లో పెట్టి చెట్లు కింద నిలబడవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతుల పేర్కొంటున్నారు. తక్షణమే యూరియా కొరత లేకుండా అధికారులు పలు చర్యలు చేపట్టాలని రైతుల పేర్కొంటున్నారు