మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి స్తానిక మోపిదేవిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని శనివారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వి. సుజాత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం, ఆలయ పర్య వేక్షకులు సత్యనారాయణ ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి అరుణ, తహశీల్దార్ హరినాథ్, సీఐ ఈశ్వరరావు, తదితరులు ఉన్నారు.